![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ - 115 లో.... విశ్వపై ప్రేమ కేసు పెట్టడంతో ఇరు కుటుంబాలు రాజీ పడతాయి. ఇక కేసు వాపస్ తీసుకుంటారు. సొంత అన్న పైనే కేసు పెట్టేంత మారిపోయావన్నమాట. నిన్ను ఎంత ప్రేమగా గారాబంగా పెంచామని ప్రేమపై భద్రవతి విరుచుకుపడుతుంది. సేనాపతి కూడా ప్రేమపై కోప్పడతాడు. శత్రువులు ఇంటి ముందు కాదు ఇంట్లోనే పెంచి పెద్ద చేశామని విశ్వ అంటాడు.
అందరి మాటలకి ప్రేమ హర్ట్ అయి ఏడుస్తుంది. ఒకవైపు ప్రేమ మరొకవైపు భద్రవతి.. సేనాపతి, విశ్వ, ముగ్గురు జరిగిన దాని గురించి ఆలోచిస్తుంటారు. ఆ తర్వాత రామారాజు దగ్గరికి వేదవతి వస్తుంది. చందు పెళ్లి గురించి భాగ్యంతో వెళ్లి మాట్లాడండి అని అంటుంది. వాళ్ళు అంత అంటున్నా మనమేలా మాట్లాడుతామని రామరాజు అంటాడు. విశ్వపై కేసు పెట్టిన విషయం బాధ కలిగిస్తుంది కానీ రామరాజు పెద్ద కొడుకు పెళ్లి కాన్సిల్ అయింది.. అందుకు సంతోషం గా ఉందని భద్రవతితో సేనాపతి అంటాడు.
అప్పుడే భాగ్యం తన ప్లాన్ లో భాగంగా శ్రీవల్లిని తీసుకొని రామరాజు ఇంటికి వస్తుంది. అదంతా భద్రవతి చూస్తుంది. లోపలికి వెళ్లి నా కూతురిని చేసుకుంటే మీ పెద్ద కొడుకునే చేసుకుంటుందట అని భాగ్యం చెప్తుంది. మీ కూతురిని నా కూతురులాగా చూసుకుంటాను పెళ్లికి ఒప్పుకోండి అని రామరాజు అనగానే.. భాగ్యం సరే అంటుంది దాంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. తరువాయి భాగంలో చందు, శ్రీవల్లిల ఎంగేజ్ మెంట్ కి ధీరజ్ ని వద్దని రామరాజు చెప్తాడు. ఆ తర్వాత భాగ్యం ఎంగేజ్ మెంట్ కి గుడిలో ఏర్పాట్లు చేస్తుంది. అది చూసి రామరాజు కుటుంబం ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |